Header Banner

టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం.. వైసీపీ హయాంలో 22,640 మందికి ఇళ్ల కోత! మంత్రి సంచలన వ్యాఖ్యలు!

  Thu Mar 13, 2025 12:30        Politics

మంత్రి నారాయణ టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల సమస్యలపై స్పందిస్తూ కీలక ప్రకటన చేశారు. గత వైసీపీ ప్రభుత్వం 22,640 మంది లబ్ధిదారులను తొలగించి వేరేవారికి ఇళ్లను కేటాయించిందని ఆయన వెల్లడించారు. వైసీపీ హయాంలో కేవలం 57,040 ఇళ్లే పూర్తయ్యాయని స్పష్టం చేశారు. లబ్ధిదారుల మార్పులలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం కమిటీ వేసి దర్యాప్తు జరిపిస్తోందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు ఎదురవుతున్న ఇబ్బందులు నిజమేనని అంగీకరించారు.


ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం అదిరిపోయే శుభవార్త.. 3 టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు - అక్కడే.! ఆ ప్రాంతాలకు మహర్దశ


77,606 మందికి ఇళ్లు ఇవ్వకుండానే వారి పేరుపై బ్యాంకు రుణాలు తీసుకున్నారని, ఇప్పుడు ఆ రుణాలను తిరిగి చెల్లించేందుకు ముఖ్యమంత్రి రూ.140 కోట్లకు అనుమతి ఇచ్చారని తెలిపారు. త్వరలోనే బ్యాంకులకు బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. టిడ్కో ఇళ్లలో మౌలిక వసతుల కల్పన కోసం హడ్కో బ్యాంక్ రూ.4,460 కోట్ల రుణం అందించనుందని, అర్బన్ అథారిటీల సహకారంతో మౌలిక వసతుల కల్పనను పూర్తి చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. జూన్ 12 నాటికి పెండింగ్‌లో ఉన్న 365,430 చదరపు అడుగుల ఇళ్లను పూర్తిచేస్తామని ప్రకటించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అలర్ట్.. భారీ అల్పపీడనం.! సుడిగాలులు వస్తున్నాయ్!

 

మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ 1 నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!

 

నేడు (13/3) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్!

 

తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!

 

వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #tidkohouses #scam #fruad #todaynews #flashnews #latestnews